ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలో సంచలనం సెట్ చేస్తున్న డివోషనల్ చిత్రమే ‘హనుమాన్ అన్శ్’. దర్శకుడు విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ఈ చిన్న చిత్రం షాకింగ్ విజయాన్ని నమోదు చేసి ఇండియన్ సినిమా హిస్టరీ లోనే భారీ లాభాలు అందించే సినిమాగా అవతరించేలా కనిపిస్తుంది.
కేవలం రెండే కోట్ల బడ్జెట్ తో వచ్చి ఇప్పుడు ఏకంగా 500 కోట్ల నెట్ వసూళ్లపై కన్నేసింది అన్నట్టుగా ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఈ సినిమా కొట్టిన హిట్ సౌండ్ ఏ రేంజ్ లో ఉందంటే.. బాలీవుడ్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ఏది అంటే ఎవరైనా ధురంధర్ 1 లాంగ్ రన్ కోసం చెబుతారు. కానీ ‘హనుమాన్ అన్శ్’ ఆ సినిమా పెట్టిన రికార్డులు కూడా భారీ మార్జిన్ తో క్రాస్ చేస్తూ దూసుకెళ్తుంది.
ఆరో శుక్రవారం ధురంధర్ 3.2 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకుంటే ‘హనుమాన్ అన్శ్’ మాత్రం ఏకంగా 10 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. సో ఇక్కడే ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని నమోదు చేసింది అనేది అర్ధం అవుతుంది. ఇక ఫైనల్ రన్ లో ఈ సినిమా డెఫినెట్ గా 500 కోట్ల మార్క్ ని అందుకోవడం గ్యారెంటీ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. సో ఈ డివోషనల్ సినిమా ఆ మార్క్ సాధించి చరిత్ర సృష్టిస్తుందా లేదా అనేది చూడాల్సిందే.
