అదే మాకు పెట్టుబడి అంటున్న టాప్ ప్రొడ్యూసర్

అదే మాకు పెట్టుబడి అంటున్న టాప్ ప్రొడ్యూసర్

Published on Mar 10, 2013 12:08 PM IST

Bandla-Ganesh

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణం ప్రారంభించిన అనతి కాలంలోనే భారీ చిత్రాలను నిర్మించి, ‘గబ్బర్ సింగ్’ తో ఇండస్ట్రీ రికార్డు కొట్టిన బండ్ల గణేష్ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లిస్టులో ఒకరుగా చేరిపోయారు. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తో ‘బాద్షా’, అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలను నిర్మిస్తున్నాడు. ఈ రెండూ కూడా భారీ బడ్జెట్ చిత్రాలే కావడం, అలాగే రెండు సినిమాలు వేసవిలోనే విడుదల కానుండడం విశేషం.

ఈ రోజు బండ్ల గణేష్ కి ఇష్టమైన మహా శివరాత్రి పండుగ, అంతే కాదు ఆయన పుట్టిన రోజు కూడా ఈ రోజే. ఈ సందర్భంగా ఆయన డైలీ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇద్దరు స్టార్ హీరోలతో రెండు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు, మీకంత డబ్బు ఎలా వచ్చిందనడిగితే ఆయన సమాధానమిస్తూ ‘ చాలా సింపుల్ విషయమండి ఒక స్టార్ హీరో డేట్స్ సంపాదించి చూడండి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో మీకే తెలుస్తుంది. ఒక స్టార్ హీరో డేట్స్ దొరికితే చాలండి మన దగ్గర 100 రూపాయలు లేకపోయినా సినిమా తీసెయ్యొచ్చు. స్టార్ ఇమేజ్ ఉన్న హీరో పేరే మాకు పెట్టుబడి. నేనొకటే చెబుతానండి ఒక స్టార్ హీరో మనసు గెలుచుకుంటే చాలండి లైఫ్ లో సెటిల్ అయిపోయినట్లే అందులో ఏ మాత్రం అనుమానం లేదని’ ఆయన అన్నారు.

ఆయన ఇలానే ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీసి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ 123తెలుగు.కామ్ తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు