పద్మశ్రీ డా.యం.మోహన్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు

పద్మశ్రీ డా.యం.మోహన్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు

Published on Mar 19, 2013 9:50 AM IST

mohanbabu
తెలుగు సినీ పరిశ్రమలో మంచి టాలెంట్ ఉన్న విలక్షణ నటుడు కలక్షన్ కింగ్ పద్మశ్రీ డా.యం.మోహన్ బాబు గారి పుట్టినరోజు ఈ రోజు. ఈయన 1952, మార్చి19న జన్మించాడు. మొదట ఈయన పేరు మంచు భక్తవత్సలం నాయుడు. మోహన్ బాబు తన భాల్యాన్ని తిరుపతిలో గడిపారు. ఈయన స్కూల్ చదువుని తిరుపతి లోని ఏర్పేడు గ్రామంలో చదివారు. తరువాత పై చదువుల కోసం మోహన్ బాబు చెన్నై వెళ్ళాడు. ఈయన కొద్ది రోజులు ఫిజికల్ ఇన్ స్ట్రక్టర్ గా పనిచేసారు. కానీ ఆయన మనసంత సినిమాల పైనే వుండేది. సినీ ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులను ఎదురుకున్న ఆయన 1975 లో వచ్చిన ‘స్వర్గం నరకం’ సినిమా తొలి విజయాన్ని అందుకున్నారు.

డా.దాసరి నారాయణ రావు ఈయన పేరును భక్తవత్సలం నాయుడు నుండి మోహన్ బాబుగా మార్చాడు. అప్పటి నుండి ఈయన పేరు మోహన్ బాబుగా స్థిర పడింది. .డైలాగ్స్ చెప్పడంలో శ్రీ ఎన్.టి రామారావు తరువాత మంచి పేరును సంపాదించుకున్న వ్యక్తి మోహన్ బాబు. ఈయనకు తెలుగు భాష పైన, సినిమా నిర్మాణం పైన మంచి కమాండ్ ఉంది. ఈయన ‘పెదరాయుడు’, అల్లుడుగారు’, ‘అసంబ్లీ రౌడి’,’మేజర్ చంద్రకాంత్’, ‘దేవత’ మొదలైన సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. మోహన్ బాబు గారి తండ్రి ఈ మధ్యే మరణించినందున ఈ సంవత్సరం ఆయన పుట్టిన రోజు వేడుకను జరుపుకోవడంలేదు.

123తెలుగు.కామ్ తరపున పద్మశ్రీ డా.యం.మోహన్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు, అలాగే ఆయన ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు