హ్యాపీ బర్త్ డే టు సిద్ధార్థ్

హ్యాపీ బర్త్ డే టు సిద్ధార్థ్

Published on Apr 17, 2014 2:03 PM IST

Siddharth-9
ఈరోజు టాలివుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ తన 34వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. 1979 ఏప్రిల్ 17న ఒక తమిళ్ ఫ్యామిలీలో జన్మించిన సిద్ధార్థ్ తన చిన్నతనం అంతా చెన్నై మరియు ఢిల్లీలలో గడిపాడు. ముంబైలో ఎంబిఏ పూర్తి చేసిన సిద్ధార్థ్ ‘అమృత’ సినిమాకి గాను మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు.

శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ సినిమాతో ప్రేక్షకులకు పరిచేయమైన సిద్ధార్థ్, ‘నువ్వొస్తానంటే నేనోద్దంటానా’ వంటి సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘బొమ్మరిల్లు’ సినిమా అతని కెరీర్ లో ఒక మైలురాయి.

తన లవర్ బాయ్ క్యారెక్టర్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు సిద్ధార్థ్.
ఈ సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున సిద్ధార్థ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు