డిసెంబర్ 12న ‘నా తెలుగోడు’ విడుదల – గ్రాండ్‌గా జరిగిన ప్రీ రిలీజ్ వేడుక

Telugodu Movie

డ్రీమ్ టీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హరనాథ్ పోలిచర్ల హీరోగా నటిస్తూ, స్వయంగా రచన, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు వహించిన చిత్రం ‘నా తెలుగోడు’. తనికెళ్ళ భరణి, జరీనా వహాబ్, రఘు బాబు, సుఫియా తన్వీర్, నైరా పాల్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శకుడు శివ నిర్వాణ, మైత్రి నవీన్, దర్శకుడు మహేష్ బాబు.. అమెరికాలో వైద్యుడిగా బిజీగా ఉంటూనే, సినిమాపై ఉన్న మక్కువతో హరనాథ్ సినిమాలు చేయడాన్ని ప్రశంసించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం, సామాజిక బాధ్యతతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని కొనియాడారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

హీరో, దర్శకుడు హరనాథ్ పోలిచర్ల మాట్లాడుతూ.. స్వర్గీయ ఎన్టీఆర్ తనకు స్ఫూర్తి అని, ఆయన ఆశీర్వాదంతోనే ఈ సినిమా చేశానని తెలిపారు. అమ్మ ప్రేమ, డ్రగ్స్‌పై అవగాహన, సైనికుడి జీవితం, ఆడబిడ్డ రక్షణ అనే నాలుగు ప్రధాన అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుందని చెప్పారు. సమాజానికి మంచి సందేశాన్నిచ్చే ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరారు. చిత్ర హీరోయిన్లు సుఫియా తన్వీర్, నైరా పాల్ తమ పాత్రలపై ఆనందం వ్యక్తం చేశారు.

Exit mobile version