వాల్మీకి డైరెక్టర్ సామాజిక బాధ్యత ముచ్చటేస్తుంది.

వాల్మీకి డైరెక్టర్ సామాజిక బాధ్యత ముచ్చటేస్తుంది.

Published on Sep 13, 2019 12:36 PM IST

దర్శకుడు హరీష్ శంకర్ సామజిక సమస్యలపై స్పందిస్తూ తన వంతు బాధ్యత నెరవేరుస్తున్నారు. కొద్దిసేపటి క్రితంట్విట్టర్ వేదికగా డ్రైనేజ్ లీకేజీ పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పురపాలక సంస్థని ఉద్దేశిస్తూ ‘జ్వరాలు ఎంతగా ప్రబలుతున్నాయో తెలుగు కదా, మాదాపూర్ లో గల ఒక ప్రాతంలో డ్రైనేజీ లీకై రోడ్లను అసహ్యంగా మారుస్తుంది, ఏదైనా చర్యలు తీసుకోండి’ అని సదరు సంఘటనకు సంబందించిన ఫొటోలతో సహా ట్విట్టర్ పోస్ట్ పెట్టడం జరిగింది. గతంలో కూడా హరీష్ ఇలాంటి సంఘటనలపై స్పందించడం గమనార్హం.

ఇక వరుణ్ తేజ్ హీరోగా ఆయన తెరకెక్కించిన వాల్మీకి చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. తమిళ సూపర్ హిట్ చిత్రం జిగర్తాండా కు తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. వరుణ్ సరసన పూజ హెగ్డే నటిస్తుండగా, తమిళ నటుడు అధర్వ కీలకపాత్ర చేస్తున్నారు. 14 రీల్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు. ఐతే వాల్మీకి టైటిల్ పై తీవ్ర వివాదం నడుస్తుంది.

https://twitter.com/harish2you/status/1172382895664533505

సంబంధిత సమాచారం

తాజా వార్తలు