‘హరి హర వీరమల్లు’ వారం క్రితమే ఆగిపోయిందా ?

Published on Apr 17, 2021 1:10 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐదు రోజుల క్రితం ఐసోలేషన్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు జరిపిన కరోనా పరీక్షల్లో ఆయన పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన చేస్తున్న రెండు సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ వారం క్రితమే ఆగిపోయిందట. ఈ విషయాన్ని ఇప్పటివరకు బయటకు రానివ్వలేదు టీమ్ సభ్యులు. పవన్ కు కరోనా లక్షణాలు బయటపడగానే షూటింగ్ ఆగిపోయిందట. ఇక పవన్ పూర్తిగా రికవర్ అయితేనే ఈ సినిమా రీస్టార్ట్ అవుతుందట.

ఇక ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కూడ కాస్త గ్యాప్ తర్వాతే స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. మొత్తానికి పవన్ హెల్త్ అప్సెట్ కావడంతో రెండు సినిమాలు ఆగిపోయాయి. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నారు. పవన్ మొదటిసారి హిస్టారికల్ నేపథ్యంలో చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :