హ‌రికృష్ణగారిది గొప్ప మనసు – కీర‌వాణి
Published on Aug 31, 2018 12:52 am IST


తెలుగుదేశం పార్టీ సినీయ‌ర్ నాయ‌కుడు నందమూరి హరికృష్ణగారి మరణంతో సినీ రాజకీయ రంగాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. హరికృష్ణగారి మృతి పై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కాగా హ‌రికృష్ణ‌కు స‌త్సంబంధాలున్నాయి. వారు ఈ సంద‌ర్భంగా హ‌రికృష్ణ‌తో త‌మ అనుబంధాన్ని నెమ‌రువేసుకుంటున్నారు.

తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీర‌వాణి.. హ‌రికృష్ణ‌కు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర అంశాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. హ‌రికృష్ణగారిది గొప్ప మనసు. ఎలాంటి భేష‌జాల్లేని గొప్ప మ‌నిషి. ఎన్టీయార్ సీఎంగా ఉన్న‌ప్పుడు ఒక‌రోజు హ‌రికృష్ణ హైద‌రాబాద్‌లో కార్‌లో వెళుతున్నారు. ముషీరాబాద్‌లో ట్రాఫిక్ సిగ్న‌ల్ దాటార‌న్న కార‌ణంతో.. ఓ పోలీస్ ఆయ‌న‌ను ఆపి చ‌లానా రాశారు. హ‌రికృష్ణ తానెవ‌రో చెప్ప‌కుండా చ‌లానా క‌ట్టేసి వెళ్లారని కీర‌వాణి ట్వీట్ చేశారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook