హరీశ్ శంకర్‌కు మెగా హీరోలతో సినిమాలంటే పూనకం వచ్చేస్తుంది

Published on Sep 20, 2019 7:55 pm IST

దర్శకుడిగా హరీశ్ శంకర్ ఏడు సినిమాలు చేస్తే అందులో 4 సినిమాలు మెగా హీరోల సినిమాలే ఉండటం విశేషం. పవన్ కళ్యాణ్ హీరోగా ‘గబ్బర్ సింగ్’ సినిమాను తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ రాబట్టి పవర్ స్టార్ అభిమానుల్లో మంచి గౌరవం దక్కించుకున్న హరీశ్ ఆ తర్వాత కూడా అదే విజయపరంపరను కొనసాగించారు.

2015లో ధరమ్ తేజ్ హీరోగా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్
‘ తీసి విజయాన్ని అందుకున్న ఈ మాస్ డైరెక్టర్ 2017లో అల్లు అర్జున్ హీరోగా ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి మాస్ ఎంటెర్టైనర్ తెరకెక్కించారు. ఆ చిత్రం బన్నీ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచింది.

ఇలా మెగా కుటుంబంలోని ముగ్గురు హీరోలతో మూడు హిట్ సినిమాలిచ్చిన హరీశ్ ఇప్పుడు మెగా ప్రిన్స్ హీరోగా ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం ఈరోజే విడుదలై మాస్ ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అభిమానులైతే హిట్ ఖాయమని అంటున్నారు. ఇలా ఎప్పటికప్పుడు తమ అంచనాల్ని అందుకునేలా సినిమాలు తీస్తుండటంతో మెగా హీరోలతో సినిమా అంటే హరీశ్ శంకర్‌కు పూనకం వచ్చేస్తుంది అంటున్నారు మెగా ఫ్యాన్స్.

సంబంధిత సమాచారం :

X
More