శంభో శంకర పెద్ద హిట్ అవుతుంది -హరీష్ శంకర్ !

శంభో శంకర పెద్ద హిట్ అవుతుంది -హరీష్ శంకర్ !

Published on Jun 8, 2018 11:22 PM IST

కమెడియన్ షకలక శంకర్ , కారుణ్య జంటగా నూతన దర్శకుడు శ్రీధర్ తెరకేకించిన చిత్రం ‘శంభో శంకర’ ఈచిత్రం యొక్క టీజర్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చేతులమీదుగా కొద్దీ సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర నిర్మాతల్లో ఒకరైన సురేష్ కొండేటి మాట్లాడుతూ ఒక రోజు శంకర్ నాకు ఫోన్ చేసి ఒకసారి కలవాలని అడిగాడు .ఈ చిత్ర డైరెక్టర్, శంకర్ నాదగ్గరికి వచ్చి అన్న ఒక మంచి కథ వుంది విను అని అడిగారు కథ విన్నాను చాల బాగా నచ్చిందని చెప్పాను .తరువాత శంకర్ ఈ సినిమాని రమణ రెడ్డి నిర్మాత గా చేస్తానన్నారు . మీరు కూడా మరో ప్రొడ్యూసర్ గా ఉండాలని అని అడిగారు వారు అడిగిన వెంటనే ఏం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాను. కేవలం 35 రోజుల్లునే అనుకున్న బడ్జెట్లో ఈ సినిమాను పూర్తి చేశాం. ఈ సినిమా తరువాత శంకర్ మరో పది సినిమాలు చేస్తాడు. నాకే రెండు శంకర్ తో మూడు సినిమాలు తీయాలని వుంది అని తప్పకుండ ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తున్నాని అన్నారు .

ముఖ్య అతిధిగా వచ్చినా హరీష్ శంకర్ మాట్లాడుతూ షకలక శంకర్ నాకు చాలా కాలం నుండి తెలుసు. పవన్ కళ్యాణ్ ను నర నరాల్లో ఎక్కించుకున్నాడు శంకర్ . గబ్బర్ సింగ్ సినిమా సమయంలో శంకర్ కి నాకు మంచి అనుబంధం ఏర్పడింది . చాలాకష్ట పడి ఈ స్థాయి కి వచ్చాడు .సినిమాలో ఫైట్స్ చాలా బాగున్నాయి . ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుంది అని అన్నారు.

దర్శకుడు శ్రీధర్ మాట్లడుతూ సినిమాలో శంకర్ నుండి ఏం ఆశిస్తారో అన్ని ఈ సినిమాల్లో ఉన్నాయి. ఈ చిత్రం అందరికి నచ్చుతుంది . ఈ చిత్రం ఇంత బాగా రావడానికి కారణమైన నిర్మాతలకి , సాంకేతిక నిపుణలకి ధన్యవదాలు . అలాగే టీజర్ లాంచ్ చేయడానికి వచ్చినా హరీష్ శంకర్ కి కృతజ్ఞతలు తెలిపారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు