బాలు గారి విషయంలో మీడియాపై హరీష్ సెటైర్స్.!

Published on Sep 26, 2020 3:58 pm IST

మన దేశపు లెజెండరీ గాయకులు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారి మరణ వార్త దేశ వ్యాప్తంగా కలచి వేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన అంత్యక్రియలు కూడా ముగిసాయి. అయితే ఆయన అకాల మరణం ఇప్పటికీ ఎంతో మందిని బాధిస్తుంది. ఈ అంశం విషయంలో మన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ మన దేశపు జాతీయ స్థాయి మీడియాపై ఒక ఆసక్తికర ట్వీట్ తో వీడియో పెట్టారు.

బాలు గారి గొప్పదనాన్ని ప్రతిపాదిస్తూ అంతర్జాతీయ మీడియాలో ప్రముఖ ఛానెల్ అయినటువంటి బీబీసీ వారు ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసారు. దీనితో ఆయన “ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో..మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది..అంతేలే..కొందరి స్థాయి విశ్వవ్యాప్తం..ఇరుకు సందుల్లో కాదు..” అంటూ మన జాతీయ మీడియాకు స్ట్రైట్ గానే స్ట్రాంగ్ సెటైర్ వేశారు. దీనితో నెటిజన్స్ కూడా హరీష్ వేసిన ట్వీట్ సరైనదే అని జాతీయ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More