మరోసారి రవితేజ – హరీష్ శంకర్ ల చిత్రం?

మరోసారి రవితేజ – హరీష్ శంకర్ ల చిత్రం?

Published on Feb 27, 2015 2:24 PM IST

haeish-shenkar-raviteja
షాక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై మిరపకాయ్ తో హిట్ కొట్టిన దర్శకుడు హరీష్ శంకర్. ఈ రెండు చిత్రాలకు రవితేజ హీరో. తాజా సమాచారం ప్రకారం వీరి కాంబినేషన్ లో మరో సినిమా రానుందని తెలుస్తుంది. హిందీలో ఘన విజయం సాధించిన ‘స్పెషల్ 26’ సినిమా రీమేక్ లో నటిస్తానని రవితేజ ప్రకటించిన విషయం తెలిసినదే.

తాజా సమాచారం ప్రకారం ఆ చిత్రాన్ని హరీష్ టెక్ అప్ చేయనున్నట్లు తెలుస్తుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించే సూచనలు వున్నాయి. దొంగతనాల నేపధ్యంలో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ‘కిక్ 2’ షూటింగ్ లో బిజీగా వున్న రవితేజ ఆ తరువాత ‘బెంగాల్ టైగర్’ చిత్రంలో నటిస్తాడు. వీటి తరువాత ఈ చిత్రం ప్రారంభంకానుంది.

తాజా వార్తలు