అక్టోబర్ చివర్లో మొదలు కానున్న హరీష్ శంకర్ ‘మిస్టర్ సుబ్రమణ్యం’

అక్టోబర్ చివర్లో మొదలు కానున్న హరీష్ శంకర్ ‘మిస్టర్ సుబ్రమణ్యం’

Published on Oct 4, 2014 1:47 AM IST

Harish-Shankar1

‘మిరపకాయ్’, ‘గబ్బర్ సింగ్’ లతో వరుస హిట్స్ అందుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్. హరీష్ శంకర్ ప్రస్తుతం తన తదుపరి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. మెగా కాపొఉన్ద్ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించనున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర టీం యుఎస్న్ , కెనడాకి చెందినా ఆర్టిస్టులు కావాలని టాలెంట్ హంట్ కూడా నిర్వహించారు.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ పీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. అలాగే అక్టోబర్ 24 నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సినిమాని మొదలు పెట్టిన తర్వాత కంటిన్యూ షూటింగ్ తో శరవేగంగా షూటింగ్ ఫినిష్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి ‘మిస్టర్ సుబ్రమణ్యం’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడీగా ఎవరు నటించనున్నారు, మిగతా నటీనటులు మరియు తెక్నిల టీం వివరాలను త్వరలోనే అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు