రికార్డుల రారాణి: టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా హర్మన్ చరిత్ర

రికార్డుల రారాణి: టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా హర్మన్ చరిత్ర

Published on Dec 27, 2025 7:53 PM IST

Harmanpreet Kaur
హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur ).. ఈ పేరు వింటే చాలు, గ్రౌండ్‌లో ఆమె కొట్టే భారీ సిక్సర్లు కళ్ళ ముందు కదలాడుతాయి. కానీ ఇప్పుడు ఆమె కేవలం ఒక స్టార్ ప్లేయర్ మాత్రమే కాదు, భారత మహిళా క్రికెట్ రూపురేఖలనే మార్చేసిన గొప్ప కెప్టెన్ (Captain). ఒకప్పుడు “మనం కప్పు గెలవలేము ఏమో” అనే సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ, తన నాయకత్వంతో టీమిండియాను విజయపథంలో నడిపిస్తోంది.

కల నిజమైన వేళ – వరల్డ్ కప్ మనదే!

ఎన్నో ఏళ్లుగా మనందరం దేనికోసమైతే ఎదురుచూస్తున్నామో, ఆ కలను హర్మన్ నిజం చేసి చూపించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి పెద్ద జట్లను దాటుకుని, భారత జట్టుకు ODI వరల్డ్ కప్ (World Cup) అందించి చరిత్ర సృష్టించింది. ఒక ఐసీసీ (ICC) ట్రోఫీని ముద్దాడిన మొట్టమొదటి భారతీయ కెప్టెన్‌గా రికార్డులకెక్కింది. ఈ విజయం మన దేశ క్రికెట్ చరిత్రలోనే ఒక బంగారు పేజీ.

ప్రపంచం మెచ్చిన రికార్డు

మొన్నటిదాకా మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ పేరే వినిపించేది. కానీ మన హర్మన్ ఆ రికార్డును బద్దలు కొట్టేసింది. T20 క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా ఇప్పుడు మనమ్మాయి పేరే టాప్‌లో ఉంది. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా ఆమె సాధించిన ఈ రికార్డు మనకు ఎంతో గర్వకారణం.

లీగ్ క్రికెట్‌లోనూ Harmanpreet Kaur రూటే సపరేటు

ఇక మన దేశంలో జరిగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో అయితే హర్మన్ జోరు మామూలుగా లేదు. ముంబై ఇండియన్స్ టీమ్‌ను ముందుండి నడిపిస్తూ, ఇప్పటికీ రెండు సార్లు ట్రోఫీలను (2 Titles) గెలిపించింది. కష్ట సమయాల్లో టీమ్‌ను ఎలా గెలిపించాలో ఆమెకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో!

దేశానికి ఎన్నో పతకాలు

కేవలం కప్పులే కాదు, దేశానికి పతకాలు తేవడంలోనూ హర్మన్ ముందుంది.

చైనాలో జరిగిన ఏషియన్ గేమ్స్ (Asian Games)లో మన జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ గోల్డ్ మెడల్ అందించింది.

కామన్వెల్త్ గేమ్స్‌లో గట్టి పోటీని తట్టుకుని సిల్వర్ మెడల్ సాధించింది.

ఆసియాలో మనదే పైచేయి అని నిరూపిస్తూ రెండు ఆసియా కప్స్ (Asia Cups) కూడా తన ఖాతాలో వేసుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు