సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ‌రోం హ‌ర’

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ‌రోం హ‌ర’

Published on Jun 12, 2024 9:01 PM IST

నైట్రో స్టార్ సుధీర్ బాబు న‌టించిన లేటెస్ట్ మూవీ ‘హ‌రోం హ‌ర’ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు జ్ఞాన‌సాగ‌ర్ ద్వార‌క తెర‌కెక్కించగా, పూర్తి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ మూవీ రానుంది. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ ప‌నులు ముగించుకుంది.

‘హ‌రోం హ‌ర’ మూవీకి సెన్సార్ బోర్డు ‘A’ స‌ర్టిఫికెట్ ను జారీ చేసింది. ఈ సినిమాలో యాక్ష‌న్ డోస్ కాస్త ఎక్కువ‌గా ఉన్న కార‌ణంగానే సెన్సార్ ‘A’ స‌ర్టిఫికెట్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక సుధీర్ బాబు యాక్ష‌న్ ఈ సినిమాలో నెక్ట్స్ లెవెల్ లో ఉండ‌బోతున్న‌ట్లుగా చిత్ర యూనిట్ చెబుతూ వ‌స్తోంది. దీనికి త‌గ్గ‌ట్టుగానే ఈ చిత్ర ట్రైల‌ర్ కూడా ఉండ‌టంతో ఈ సినిమాపై అంచ‌నాలు అమాంతం పెరిగిపోయాయి.

ఇక ఈ సినిమాలో మాళ‌విక శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా, ర‌వి కాలె, కేశ‌వ్ దీప‌క్, సునీల్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తుండ‌గా, జూన్ 14న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి విజ‌యాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు