కరోనా బారిన పడిన బడా నిర్మాత..!

Harvey Weinstein

కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. హాలీవుడ్ లో ప్రముఖ నటులు, నిర్మాతలు సైతం దీని బారిన పడుతున్నారు. హాలీవుడ్ సీనియర్ హీరో టామ్ హాంక్స్ సైతం కరోనా బారినపడి, చికిత్స తరువాత కోలుకొని వెళ్లారు.

కాగా హాలీవుడ్ బడా నిర్మాత హార్వీ విన్స్టైన్స్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో ఆయనను ప్రత్యేక వార్డ్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈయన మీటూ ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. హాలీవుడ్ కి చెందిన అనేక మంది తారలు ఈ ప్రొడ్యూసర్ పై లైంగిక ఆరోపణలు చేశారు. ఇప్పటికే హాలీవుడ్‌ హీరోయిన్‌ సోఫియా మైల్స్‌ తండ్రి పీటర్‌ మైల్స్‌ కరోనా బారిన పడి కన్నుమూశారు.

Exit mobile version