హ్యాట్రిక్ అందుకున్న సమంత !

హ్యాట్రిక్ అందుకున్న సమంత !

Published on May 11, 2018 4:22 PM IST


ప్రస్తుతం సమంత కన్నా సంతోషంగా మరే హీరోయిన్ ఉండరేమో. ఎందుకంటే ఈ వేసవిలో కేవలం నెలన్నర గ్యాప్లో ఆమెకు వరుసగా మూడు విజయాలు దక్కాయి. మొదటగా రిలీజైన రామ్ చరణ్, సుకుమార్ ల ‘రంగస్థలం’తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బుధవారం రిలీజైన ‘మహానటి’తో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈరోజు తమిళంలో విడుదలైన ‘ఇరుంబు తిరై’ చిత్రం కూడ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సమంత ఖాతాలో మూడో విజయం ఖాయమైంది. ఈ విషయాన్నే చెబుతూ సమంత ట్విట్టర్ ద్వారా ఇది నాకు బెస్ట్ సమ్మర్. హ్యాట్రిక్ విజయాలు దక్కాయి. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ సంతోషంగా ఉన్న అమ్మాయిని నేనే అంటూ ట్వీట్ చేశారు.

తాజా వార్తలు