నాలో స్ఫూర్తికి కారణం ఆయనే – అక్షయ్‌ కుమార్‌

నాలో స్ఫూర్తికి కారణం ఆయనే – అక్షయ్‌ కుమార్‌

Published on Mar 22, 2026 12:01 PM IST

Akshay Kumar

హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. మార్షల్‌ ఆర్ట్స్‌ దిగ్గజం, ప్రముఖ హాలీవుడ్‌ నటుడు చక్‌ నోరిస్‌ కన్నుమూశారు. తన 86 ఏళ్ల వయసులో ఆయన అనారోగ్యంతో మరణించారు. కొన్ని నెలల కిందటే ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం విషమించి మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌.. తన కెరీర్‌ ప్రారంభంలో చక్‌ నోరిస్‌ తనలో స్ఫూర్తికి కారణమైన వ్యక్తి అని, ఆయనకి తాను కృతజ్ఞుడను’ అని తనపై చూపిన ప్రభావాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్స్‌ వేదికగా నివాళులర్పించారు.

కాగా 1968లో ‘ది రెక్కింగ్‌ క్రూ’ సినిమాతో చక్‌ నోరిస్‌ తెరకు పరిచయమయ్యారు. ఆయన నటించిన ‘గుడ్‌ గాయ్స్‌ వేర్‌ బ్లాక్‌’ చిత్రం మంచి విజయం సాధించడంతో యాక్షన్‌ స్టార్‌గా గుర్తింపు వచ్చింది. చక్‌ నోరిస్‌ నటనతో పాటు మార్షల్‌ ఆర్ట్స్, ఫిలాసఫీతో పాటు పలు అంశాలపై ఎన్నో పుస్తకాలు రాసిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కొందరు సినీ ప్రముఖులు కోరారు. ఇక మా 123తెలుగు.కామ్ తరఫున చక్‌ నోరిస్‌ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

తాజా వార్తలు