లెజెండరీ గాయని ఆశా భోస్లే హెల్త్ అప్ డేట్ !

ప్రముఖ గాయని ఆశా భోస్లే తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఆశా భోస్లే మనవరాలు జానై భోస్లే సోషల్ మీడియాలో ఆమె తాజాగా హెల్త్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. ‘మా అమ్మమ్మగారు ఆశా భోస్లే, తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో జాయిన్ కావాల్సి వచ్చింది. దయచేసి మా ప్రైవసీకి విలువ ఇవ్వాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. చికిత్స కొనసాగుతోంది. అంతా త్వరగా కుదురుకుంటుందని ఆశిస్తున్నాము’ అని ఆమె తెలిపారు.

మరోవైపు గాయని ఆశా భోస్లే వేగంగా కోలుకుంటున్నారని, తన వైద్యులతో మాట్లాడుతున్నారని.. తను బాగానే ఉన్నానని చూపించడానికి బ్రొటనవేళ్లు కూడా కదిలిస్తున్నారని ఆమె సన్నిహితులు పోస్ట్ లు పెడుతున్నారు. కాగా భారతరత్న లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా భోస్లే.. నేపథ్య గాయనిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. భారతీయ సంగీత ప్రపంచంలో కొన్ని దశాబ్దాలపాటు తన గాత్రంతో అలరించారు.

Exit mobile version