బన్నీ సినిమాకి భారీ బడ్జెట్ !
Published on Jun 13, 2018 2:54 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ‘నా పేరు సూర్య’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా ఆడలేదు. దీంతో బన్నీ కొంత నిరుత్సాహానికి గురయ్యారు. కానీ సూర్య పాత్రలో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం కుటుంబంలో కలిసి హాలీడే ట్రిప్లో ఉన్న ఆయన తిరిగి రాగానే విక్రమ్ కుమార్ తో కథా చర్చల్లో పాల్గొననున్నారు.

ఇప్పటికే విక్రమ్ చెప్పిన స్టోరీ లైన్ విన్న ఆయన ప్రాజెక్ట్ పట్ల పాజిటివ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయి మేకింగ్ అవసరమైన ప్రాజెక్ట్ కు సుమారు రూ.80 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చవుతుందని విక్రమ్ కుమార్ భావిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. మరి తన మార్కెట్ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని ఇంత పెద్ద మొత్తంతో సినిమా చేయడానికి బన్నీ ఒప్పుకుంటారా లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook