కరోనా వల్ల ఆ సినిమాలకు తీరని లోటే !

కరోనా వల్ల ఆ సినిమాలకు తీరని లోటే !

Published on Apr 8, 2020 6:35 PM IST

కరోనా మహమ్మారి దెబ్బకు సమ్మర్ లో రావాల్సిన సినిమాలన్నీ పోస్ట్ ఫోన్ అయిపోయాయి. పెద్ద సినిమాలకు సమ్మర్ బాగా కలిసి వచ్చే అంశం. ఇక సమ్మర్ సీజన్ తరువాత ముఖ్యమైన సీజన్ అంటే దసరానే. విజయదశమి సెలవుల్ని టార్గెట్ చేసుకుని స్టార్ హీరోల సినిమాలు పోటీకి సిద్దమవుతుంటాయి.

అయితే కరోనా ప్రభావంతో ఇప్పుడు ఆ పోటీ రెట్టింపు అయ్యేలా కనిపిస్తోంది. దసరాకి భారీ సినిమాలతో పాటు చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. చిరు ‘ఆచార్య’, రజనీ ‘అన్నాత్తే’, యాష్ ‘కె.జి.ఎఫ్ 2’ అలాగే కంగనా ‘తలైవి’, నితిన్ ‘రంగ్ దే’ వరుణ్ తేజ్ ‘బాక్సర్’ మూవీ ఇంకా అప్పటికీ కొన్ని సినిమాలు రేసులోకి రానున్నాయి. మొత్తానికి వచ్చే దసరా సీజన్ టాలీవుడ్ కి కీలకంగా మారిపోయింది.

కాగా చిరంజీవిల ‘ఆచార్య’, రజనీ మూవీ అలాగే ‘కె.జి.ఎఫ్ 2’ దసరాకి వస్తే.. భారీ అంచనాలు ఉన్న ఆ సినిమాల ప్రభావంలో మిగిలిన మిడియమ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు పరిస్థితి ఎంటనేదే ఇప్పుడు ప్రశ్న. మళ్లీ దసరా లాంటి సీజన్ అంటే… సంక్రాంతినే. అప్పుడు ఎలాగూ భారీ సినిమాలతో మోత మోగిపోతుంది. సో.. చిన్న మరియు మిడియమ్ రేంజ్ సినిమాలకు కష్టమే. ఓవరాల్ గా సమ్మర్ సీజన్ మిస్ అవ్వడం చిన్న మరియు మిడియమ్ రేంజ్ సినిమాలకు తీరని లోటే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు