రజినీ ‘లింగ’లో హై రేంజ్ గ్రాఫిక్స్

రజినీ ‘లింగ’లో హై రేంజ్ గ్రాఫిక్స్

Published on Sep 4, 2014 11:04 AM IST

lingaa
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా సెట్స్ పై ఉందటే అభిమానుల్లో ఆ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. అది కూడా రజినీకాంత్ ని గతంలో ‘ముత్తు’, ‘నరసింహా’ లాంటి సినిమాలు తీసిన కెఎస్ రవికుమార్ తీస్తున్నాడు అంటే ఆ మూవీపై ఉన్న అంచనాలు డబుల్ అవుతాయి. అలా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా మూడవ సినిమా ‘లింగ’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శిమోఘలోని లింగనమక్కి డామ్ వద్ద జరుగుతోందని ఇది వరకే తెలియజేశాం.

తాజా వార్తల ప్రకారం ఈ సినిమాలో హై రేంజ్ లో గ్రాఫిక్స్ ఉంటాయని అంటున్నారు. ఈ సినిమా కథాంశం మొత్తం ఒక డామ్ చుట్టూ తిరుగుతుంది అందుకే ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువ ప్రాధాన్యం ఉందని ఈ చిత్ర టీం అంటోంది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న షెడ్యూల్ పూర్తి కాగానే ఈ చిత్ర టీం కొన్ని సాంగ్స్ కోసం యూరప్ వెళ్లనున్నారు. వినాయక చవితి కానుకగా లింగ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. రజినీ ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు