పూరి-ఎన్.టి.ఆర్ సినిమాలో భారీ ఇంటర్వల్ బ్లాక్

పూరి-ఎన్.టి.ఆర్ సినిమాలో భారీ ఇంటర్వల్ బ్లాక్

Published on Aug 10, 2014 2:06 PM IST

jr-ntr-puri-jaganath

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఓ సినిమా సెట్స్ పైన ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం వక్కంతం వంశీ ఈ సినిమా కోసం చాలా కొత్త కథని అందిస్తే, దానికి పూరి జగన్నాధ్ తన ట్రేడ్ మార్క్ డైలాగ్స్, ఫాస్ట్ స్క్రీన్ ప్లే ని జోడించాడు.

అలాగే ఈ పవర్ ప్యాక్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లను కూడా డిజైన్ చేసారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ ని చాలా భారీగా ఉండేలా డిజైన్ చేసారు. ఈ సినిమాకి ఆ ఫైట్ హైలైట్ అవుతుందని కూడా అంటున్నారు. రేపటి నుంచి ఎన్.టి.ఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు