సమీక్ష: ‘ఈషా’ – రొటీన్ హారర్ డ్రామా

సమీక్ష: ‘ఈషా’ – రొటీన్ హారర్ డ్రామా

Published on Dec 26, 2025 1:02 AM IST

Eesha movie Review

విడుదల తేదీ : డిసెంబర్ 25, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అదిత్ అరుణ్, హెబా పటేల్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ తదితరులు
దర్శకుడు : శ్రీనివాస్ మన్నె
నిర్మాతలు : కెఎల్ దామోదర్ ప్రసాద్
సంగీత దర్శకుడు : ఆర్ ఆర్ ధ్రువన్
సినిమాటోగ్రాఫర్ : సంతోష్ సనమోని
ఎడిటర్ : వినయ్ రామసామి వి

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఒకటే ఈషా. సాలిడ్ హారర్ థ్రిల్లర్ గా మంచి ప్రమోషన్స్ తో ఆడియెన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఏ మేరకి మెప్పించింది అనేది సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఓ నలుగురు స్నేహితులు నయన (హెబా పటేల్), అపర్ణ (సిరి హనుమంత్) అలాగే కళ్యాణ్ (అదిత్ అర్జున్) ఇంకా వినయ్ (అఖిల్ రాజ్ ఉద్దెమరి) లు కలిసి సమాజంలో సామాన్యుల బలహీనతను క్యాష్ చేసుకుంటున్న దొంగ బాబాల తాలూకా నిజ స్వరూపాలు బయట పెడుతూ ఉంటారు. ఇలా తమ లిస్ట్ లోకి ఆది దేవ్ (బబ్లు పృథ్వీ) కూడా వస్తాడు. అతన్ని టార్గెట్ చేసిన తర్వాత ఈ నలుగురు ఏం చేశారు? అతన్ని కలిసిన ఆది దేవ్ వారికి ఇచ్చిన సవాలు ఏంటి? అందులో వీరు నలుగురు సర్వైవ్ అయ్యారా లేదా? చివరికి వీరికి ఏమైంది? అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్ర దర్శకుడు ఒక డిఫరెంట్ ఐడియాని తీసుకున్నారు. అలాగే దీనికి హారర్ ఎలిమెంట్స్ పెట్టి దానిని ఎండింగ్ లో రివీల్ చేసారు. ఈ క్రమంలో సౌండ్ డిజైన్ డిపార్ట్మెంట్ వర్క్ మాత్రం బాగుంది.

సినిమాలో పరిస్థితికి తగ్గట్టుగా మరింత నాచురాలిటీ అందించే విధంగా డిజైన్ చేసుకున్న సౌండ్స్ కొన్ని చోట్ల థియేటర్స్ లో చూసే ఆడియెన్స్ కి మరింత నాచురల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తాయి. వీటితోనే కొన్ని హారర్ సీన్స్ వర్క్ అయ్యాయి. ఇక లీడ్ నటులు నలుగురూ తమ నుంచి ఓకే రేంజ్ పెర్ఫామెన్స్ లు అందించారు. సినిమాలో ఈషా ఎవరు? అనే ప్రశ్న దాని సస్పెన్స్ క్లైమాక్స్ లో రివీల్ చేసిన విధానం ఓకే అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్:

స్ట్రైట్ అంశానికే వస్తే.. మేకర్స్ ఈ సినిమా రిలీజ్ కి ముందు గట్టి హంగామా చేశారు. తెలుగు ఆడియెన్స్ జీవితం లోనే ఇలాంటి హారర్ సినిమా చూసి ఉండరు అని అంగీకార పత్రం అంటూ చాలానే తతంగం నడిచింది కానీ సీన్ కట్ చేస్తే సినిమాలో ఆ రేంజ్ అంశాలు ఉండకపోవడం గమనార్హం.

ఆ స్టేట్మెంట్స్ నమ్మి వెళ్లే ఆడియెన్స్ అంచనాలు అందుకోలేక ఈ సినిమా డిజప్పాయింట్ చేస్తుంది. చాలా స్లోగా అండ్ సాగదీతగా తీసుకెళ్లే సన్నివేశాలతో మెయిన్ గా ఫస్టాఫ్ అంతా ఇలానే నడుస్తుంది. దీనితో అసలు చూసే ఆడియెన్స్ కి ఎందుకు ఇంతలా సాగదీస్తున్నారు అనేది అర్ధం కాకుండా ఉంటుంది. అలాగే ఈ హారర్ డ్రామాలో పెద్దగా ఎలాంటి హై మూమెంట్స్ కూడా ఉండవు.

కొన్ని సీన్స్ ట్రై చేసిన కూడా అవి అంత ఇంపాక్ట్ కలిగించలేకపోయాయి. పైగా అనవసరంగా పెంచేసిన సౌండింగ్ కొన్ని సీన్స్ లో జెన్యూనిటీని తగ్గించినట్టు అనిపిస్తుంది. ఇక ఫస్టాఫ్ ఒకటే అనుకుంటే సెకండాఫ్ తీరు కూడా అలానే ఉంటుంది. రిపీటెడ్ గా అనిపించే సీన్స్ పైగా క్లైమాక్స్ లో రివీల్ అయ్యిన అంశం చూసిన తర్వాత దీని కోసమా ఇంత సాగదీశారు అనే ఆలోచన చూసే ఆడియెన్స్ లో వచ్చి తీరుతుంది.

అనుకున్న ఐడియా మంచిది కావచ్చు కానీ దీనిని ప్రెజెంట్ చేసే విధానంలో చూసే ఆడియెన్ దృష్టి కోణాన్ని కించపరిచే విధంగా తెరకెక్కించడం అనేది ఒకింత అందరికీ పాజిటివ్ గా ఎక్కకపోవచ్చు. అలాగే లీడ్ నటీనటులు నుంచి అంత సాలిడ్ పెర్ఫామెన్స్ లు కూడా ఈ సినిమాలో కనిపించలేదు. కొందరి నటన అయితే ఇందులో ఆర్టిఫీషియల్ గా కూడా ఉంది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు అంత బాలేవు. మెయిన్ గా సెటప్ ఇంకా వి ఎఫ్ ఎక్స్ వర్క్ లాంటివి ఇంప్రెసివ్ గా లేవు, కానీ మిగతా టెక్నీకల్ టీం సంగీతం వగైరా అంశాలతో సినిమాని లేపే ప్రయత్నం చేశారు కానీ మెయిన్ మేటర్ వీక్ అయినపుడు వీరి ఎఫర్ట్స్ కి కూడా అంత జస్టిస్ జరిగినట్టు అనిపించదు.

అలాగే దర్శకుడు శ్రీనివాస్ మన్నే తీసుకున్న మెయిన్ పాయింట్ ఓకే కానీ దీనిని క్లైమాక్స్ లో రివీల్ చేయడానికి చేసిన ప్రయత్నాలు సాగదీత కథనం డిజప్పాయింట్ చేస్తాయి. మెయిన్ గా రైటింగ్ వీక్ గా ఉంది. కొన్ని ప్రశ్నలు సమాధానం లేకుండానే చూపించేసారు. క్లైమాక్స్ పోర్షన్ ట్విస్ట్ లాంటివి చూసే ఆడియెన్ ని మైండ్ బ్లాక్ చేసే విధంగా ఉంచాల్సింది కాస్తా వారు మరో రకంగా ఫీలయ్యే విధంగా ప్రెజెంట్ చేయడం అందరి ఆడియెన్స్ ని మెప్పించే విధంగా దర్శకుడు ప్లాన్ చేసుకున్నారు. ఇవి డిజప్పాయింట్ చేస్తాయి.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ‘ఈషా’ ఒక వీక్ హారర్ థ్రిల్లర్ అని చెప్పాలి. ప్రమోషన్స్ లో ఓ రేంజ్ లో చెప్పిన విధంగా నమ్మి ఆడియెన్స్ వెళితే వారికి నిరాశే మిగుల్తుంది. కేవలం కొన్ని పోర్షన్స్ ఇంకా క్లైమాక్స్ బాగుంది తప్పితే మిగతా అంశాల్లో ఈషా చప్పగానే సాగుతుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా ట్రై చేస్తే మంచిది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

తాజా వార్తలు