
‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ లాంటి సినిమాల తర్వాత టాలీవుడ్ స్థాయిని మరింత పెంచేలా వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ‘కంచె’. కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణంవందే జగద్గురుమ్’ లాంటి సినిమాలు చేసిన క్రిష్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించాడు. కేవలం ఒక సినిమా అనుభవం ఉన్న యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న రెండవ సినిమా ఇది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దాంతో సెప్టెంబర్ 1న ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ ని లాంచ్ చేసారు. ఈ ట్రైలర్ కి అందరి నుంచీ సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
దాంతో ఈ సినిమా రీ రిలీజ్ బిజినెస్ క్రేజ్ బాగా పెరిగింది. ప్రస్తుతం అన్ని ఏరియాలకి సంబందించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విషయంలో పలువురు పోటీ పడుతున్నారు. తాజాగా ఈ సినిమా నైజాం రైట్స్ ని భారీ మొత్తానికి రావు – సాన్స్ అనే డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కున్నారు. వారు ఎవ్వరూ అనుకోని అమౌంట్ పెట్టి కంచె నైజాం రైట్స్ తీసుకోవడం మిగతా వారిని ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా వరుణ్ తేజ్ రెండవ సినిమానే నైజాంలో భారీ రేటు పలకడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. మిగిలిన ఏరియాలలో కూడా ఇదే రేంజ్ పోటీ నెలకొంది. వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి చిరంతన్ భట్ మ్యూజిక్ అందించాడు. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న రిలీజ్ కానున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ నికేతన్ దీర్ విలన్ గా కనిపిస్తాడు.

