క్లైమాక్స్ చిత్రీకరణలో హలో గురు ప్రేమకోసమే !

క్లైమాక్స్ చిత్రీకరణలో హలో గురు ప్రేమకోసమే !

Published on Jun 21, 2018 4:09 PM IST

‘నేను లోకల్’ చిత్ర డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నటిస్తున్న చిత్రం హలో గురు ప్రేమకోసమే . ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణను జరుపుకుంటుంది ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది . దాదాపు 80 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదలకానుంది .

ఇక ఈచిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈసినిమాని యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు .రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి ఆమని ముఖ్య పాత్రలో నటిస్తున్నారు .’ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా తరువాత రామ్, అనుపమా పరమేశ్వరన్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం ఫై మంచి అంచనాలు ఉన్నాయి .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు