
నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈ చిత్రం సెప్టెంబర్ కల్లా విడుదలవ్వడానికి శరవేగంగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. కాగా ‘సినిమా చూపిస్తా మావ’ ‘నేను లోకల్’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు పని చేసిన టీమే ఈ చిత్రానికి కూడా కలిసి పని చేస్తోంది. ముఖ్యంగా ఈ చిత్ర రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ, దర్శకుడు నక్కిన త్రినాధరావు కాంబినేషనే పూర్తిగా ఎంటర్టైన్మెంట్ తో కూడుకుని ఉంటుంది. అదేవిదంగా ‘హలో గురు ప్రేమ కోసమే’ లో కామెడీనే హైలెట్ అవ్వనుందట.
తాజా సమాచారం ప్రకారం, ప్రసన్న కుమార్ రాసిన ట్రీట్మెంట్ మరియు డైలాగ్స్ బాగా వచ్చాయని ‘సినిమా చూపిస్తా మావ, నేను లోకల్’ చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో కామెడీ చాలా బాగా పండుతుందని చిత్రయూనిట్ చెబుతుంది. మరి ఈ చిత్రంతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.

