‘హలో గురు ప్రేమ కోసమే’ లేటెస్ట్ యుఎస్ కలెక్షన్స్ !

‘హలో గురు ప్రేమ కోసమే’ లేటెస్ట్ యుఎస్ కలెక్షన్స్ !

Published on Oct 20, 2018 10:26 PM IST

HelloGuruPremaKosame

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. దసరా కానుకగా అక్టోబర్ 18న విడుదలైన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో మరియు మంచి ఎంటర్టైన్ మెంట్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. కలెక్షన్స్ పరంగా కూడా రామ్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ ను రాబడుతుంది.

కాగా ఈ చిత్రం తాజాగా అమెరికాలో 110,466 డాలర్ల వసూళ్లును రాబట్టింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడుకున్న లవ్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్, అనుపమా పరమేశ్వరన్ జోడీ తమ నటనతో.. తమ మధ్య కెమిస్ట్రీతో బాగా ఆకట్టుకున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ కూడా తన మార్క్ నటనతో ఇటు నవ్వించడంతో పాటు.. అటు ఎమోషనల్ గానూ మెప్పిస్తాడు. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు

తాజా వార్తలు