తమిళం లో విడుదలవుతున్న అఖిల్ ‘హలో’ !

Akhil1
యువ అఖిల్ అక్కినేని నటించిన రెండవ చిత్రం ‘హలో’ గతఏడాది డిసెంబర్ లో విడుదలై పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఈ చిత్రం తమిళ బాషలో విడుదల కానుంది. శ్రీ లక్ష్మి జ్యోతి క్రీయేషన్స్ పతాకం ఫై ఏ ఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేయనున్నారు. విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించగా జగపతి బాబు , రమ్య కృష్ణ ముఖ్య పాత్రలను పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. డిసెంబర్లో ఈచిత్రం తమిళ ప్రేక్షకులముందుకు రానుంది.

ఇక అఖిల్ ప్రస్తుతం తన మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’లో నటిస్తున్నాడు. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదలకానుంది.

Exit mobile version