‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా ‘రాకా’ అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం భారతీయ సినిమాల్లో అత్యంత భారీ ప్రాజెక్టులలో ఒకటిగా ప్రచారం పొందుతున్న చిత్రం ఇది. పైగా పలు అంతర్జాతీయ విఎఫ్ఎక్స్ స్టూడియోలు ఈ ప్రాజెక్టు పై పని చేస్తున్నాయి. ఈ విఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కారణంగానే ఈ సినిమా విడుదల తేదీ 2027కు వెళ్లే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ సినిమాపై ఆసక్తి పెంచుతున్న ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి.
అట్లీ + అల్లు అర్జున్ తొలి కాంబినేషన్ కావడం, పైగా పాన్-వరల్డ్ విజన్ తో సినిమా తెరకెక్కుతుండటం, మొత్తానికి భారీ విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తోందని అంచనా ఉంది. ఈ మూవీలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
