తమిళ స్టార్ హీరో సూర్య – వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోంది. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. 20 ఏళ్ల అమ్మాయికి 40 ఏళ్ల వ్యక్తికి మధ్య ప్రేమ పుడితే.. ఆ అల్లరి అమ్మాయి, ప్రేమ అంటూ ఆ మధ్య వయస్కుడి చుట్టూ తిరుగుతూ సాగే ఈ కథను ఈ టీజర్ లో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు.
ముఖ్యంగా మమితా బైజు ప్రేమిస్తున్నానంటూ సూర్య వెంటపడటం.. అతను ఆమె ప్రేమను తిరస్కరించడం వంటి షాట్స్ కూడా బాగున్నాయి. అలాగే వీళ్లిద్దరి మధ్య ఎమోషన్ తో పాటు ఫన్ ను కూడా చాలా బాగా చూపించారు. సూర్యకి పోటీగా మమితా బైజు నటించిన విధానం చాలా బాగుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా కరెక్ట్ గా సెట్ అయింది.
ఇక ఈ టీజర్ లో జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్, నిమిషా రవి సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అన్నట్టు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాన్ని జులైలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కాగా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
