మెగాస్టార్ బర్త్ డే 4 సర్ ప్రైజ్ లు ఇవే !

Published on Aug 22, 2021 5:32 pm IST

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించి వరుస అప్ డేట్స్ తో ఈ రోజు ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చారు మేకర్స్. దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఈ రీమేక్‌ కి ‘గాడ్‌ ఫాదర్‌’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక టైటిల్ ను రివీల్ చేస్తూ వదిలిన మోషన్‌ టీజర్‌ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది.

అలాగే దర్శకుడు మెహ‌ర్ రమేష్ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో రాబోతున్న సినిమా టైటిల్ ను ‘భోళా శంకర్’గా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ అలాగే కీర్తి సురేష్ చిరుకి రాఖీ కడుతూ కనిపించిన వీడియో చాలా బాగుంది.

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి 154 వ చిత్రానికి సంబంధించి కూడా ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. వింటేజ్ మెగాస్టార్ బ్యాక్ అనేలా ఆ స్టిల్ ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా, బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఆచార్య టీమ్ నుంచి మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చరణ్ ఒక వీడియో పోస్ట్ చేశారు. వీడియోలో చరణ్ -చిరు ఆచార్య సెట్స్ కి వెళ్తూ కనిపించారు. మెగాస్టార్ తో కలిసి నటించే ప్రతి షాట్ ఒక గొప్ప లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ అంటూ చరణ్ పోస్ట్ చేశాడు.

అసలు మెగాస్టార్ బర్త్ డే అంటేనే అభిమానులకు ఒక పండగ, కాలం మారినా, తరాలు మారినా ఎపుడు అదే కోలాహలం, ఎప్పటికీ అదే ఉత్సాహం. అందుకే ఇప్పటికీ చిరు తన సినిమాల దూకుడును ఏ మాత్రం ఆపలేదు. ఈ సారి తన పుట్టిన రోజున ఏకంగా నాలుగు చిత్రాలకు సంబంధించిన బిగ్ అప్ డేట్స్ తో వచ్చారు చిరు.

సంబంధిత సమాచారం :