రవితేజ ‘క్రాక్’కి ముహూర్తం ఈ రోజే !

Published on Nov 14, 2019 8:23 am IST

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న సినిమాకి ‘క్రాక్’ అనే క్యాచీ టైటిల్ ను ఫిక్స్ చేసింది చిత్రబృందం. కాగా ఈ సినిమా అధికారికంగా ప్రారంభం కావడానికి ఈ రోజు ముహుర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న ఈ సినిమాని 2020 సమ్మర్ లో విడుదల్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు.

కాగా ర‌వితేజ 66వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది. ఆమె పాత్ర కూడా కీలకంగా ఉంటుందట. ఇక ఈ చిత్రంలో ర‌వితేజ ప‌వ‌ర్‌ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ గా నటించనున్నాడు. ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More