“సర్కారు వారి పాట”లో కీర్తి పై క్లారిటీ ఇదే.!

Published on Sep 22, 2020 9:09 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మాస్ ఫ్లిక్ “సర్కారు వారి పాట” షూట్ కు రెడీ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించనున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎప్పటి నుంచో ఒక విషయం తెలిసింది ఉంది. అదే ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది అని.

కానీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం ఆమెను చిత్ర యూనిట్ పక్కన పెట్టి వేరే స్టార్ హీరోయిన్ కోసం చూస్తున్నారని కథనాలు మొదలయ్యాయి. దీనితో కీర్తి ఈ చిత్రంలో ఉందా లేదా ప్రశ్న మొదలయ్యింది. అయితే ఇపుడు ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం సినీ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ ఉందని ఆ రూమర్స్ అన్నిటిని కొట్టి పడేసారు.

అలాగే ఆమె యూఎస్ వర్క్ పర్మిట్ కొరకు చిత్ర యూనిట్ వీసా కోసం కూడా అప్లై కూడా చేశారట. సో సర్కారు వారి పాట లో కీర్తీ రోల్ పదిలంగానే ఉంది. పరశురామ్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More