సీరియస్ అండ్ ఇంటెన్స్ సబ్జెట్ తో పలాస 1978 ట్రైలర్

Published on Mar 1, 2020 4:19 pm IST

రక్షిత్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం పలాస 1978. వాస్తవ సంఘటనల ఆధారంగా పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నేడు ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.

రెండు నిమిషాల నిడివి కలిగిన పలాస 1978 ట్రైలర్ సీరియస్ అండ్ ఇంటెన్స్ తో సాగింది. సాధారణంగా గ్రామాలలో నడిచే ఆధిపత్య పోరు, వర్గ పోరాటాలు, పేద ధనిక వర్గాల మధ్య నడిచే తారతమ్యాలు వంటి విషయాల ప్రధానంగా ఈ మూవీ తెరకెక్కిందనిపిస్తుంది. క్రైమ్ అండ్ యాక్షన్ తో పాటు ఎమోషన్స్ హైలెట్ గా కనిపిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె విలన్ రోల్ చేయడం గమనార్హం. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. పలాస 1978 చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మించారు.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More