అల్లు అర్జున్, పూజా జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అల వైకుంఠపురంలో. సంక్రాంతి కానుకగా వచ్చే నెల 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అల వైకుంఠపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చే నెల 6న గ్రాండ్ గా హైదరాబాద్ లో నిర్వహించనున్నారట. దర్శక నిర్మాతలతో పాటు టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు ఈ ఈవెంట్ కి అతిథిగా వచ్చే అవకాశం కలదు.
ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సీనియర్ హీరోయిన్ టబు ఓ కీలక రోల్ చేస్తుండగా హీరో సుశాంత్, నివేదా పేతురాజ్ ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
