తెలుగు ‘బిగ్ బాస్ 3’ మొదలయ్యేది ఆ రోజేనా !

Published on Jun 27, 2019 7:23 pm IST

ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్ 1’ బుల్లి స్క్రీన్ ను ఎంతటి ఉరూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు. కానీ నాని హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బిగ్ బాస్ 2’ మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక ఈ సారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా ‘బిగ్ బాస్ 3’ మొదలు కానుంది. కాగా తాజా సమాచారం ప్రకారం జూలై 21 నుండి ఈ షో ప్రసారం కానుందట.

కాగా మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ పాల్గొనబోతున్న ఈ షోలో ఈ సారి కామన్ మ్యాన్ లు ఉండరు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి ఇప్పటికే కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. సీరియల్ యాక్టర్ జాకీ, కమల్ కామరాజు, గుత్తా జ్వాల, వరుణ్ సందేశ్, తీన్మార్ సావిత్రి లాంటి సెలెబ్రిటీలు బిగ్ బాస్ 3 షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారని వార్తలు వచ్చినా.. ఇవేవి నిజం కాదని తేలిపోయిది. అయితే ఈ ‘షో’లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ను త్వరలోనే నిర్వాహకులు అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

More