బన్నీ అన్న పెళ్ళికి రాకపోవడం వెనుక అసలు కారణమిదే

Published on Jun 22, 2019 9:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ అన్నయ్య అల్లు వెంకటేష్ అలియాస్ బాబీ వివాహం హంగు ఆర్బాటం లేకుండా సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిపోయింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి మొత్తం ముగ్గురు కుమారులు కాగా వారిలో అందరికంటే పెద్దవాడు అల్లు వెంకటేష్. తండ్రికి సినీ నిర్మాణంలో సహకరిస్తూ ఉండే ఈయన పబ్లిక్ ఈవెంట్స్ లో కానీ,మెగా హీరో ల కార్యక్రమాలలో అసలు పాల్గొనకపోవడం వలన ఈయన గురించి సినీ సమాజానికి తప్ప మిగిలిన వారికి తెలిసింది చాలా అరుదు. ఐతే ఓ దశాబ్టం క్రితమే ఈయనకు నీలిమ అనే మహిళతో వివాహం కాగా 2016లో విడాకులు తీసుకొని విడిపోయారట.

కొంత కాలంగా పరిచయమున్న స్నేహితురాలైన ముంబైకి చెందిన నీలీషాను అల్లు వెంకటేష్ రెండో వివాహం చేసుకున్నారు. ఆ వివాహానికి సంబందించిన ఫోటోలు అల్లు వెంకటేష్ మీడియాతో పంచుకున్నారు.

ఈ వివాహానికి తమ్ముడు అల్లు అర్జున్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. అయితే దీని వెనుక అసలు కారణమేంటని ఆరాతీయగా ప్రస్తుతం బన్నీ, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సివుండటంతో రెండు నెలల నిరవధిక షూటింగ్ లో పాల్గొంటున్న బన్నీ వివాహానికి హాజరుకాలేకపోయారు. ఐతే తర్వాత నూతన దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారట బన్నీ.

సంబంధిత సమాచారం :

More