‘నీ కన్ను.. ‘ అంటూ ఆకట్టుకుంటున్న వైష్ణ‌వ్‌ తేజ్ !

Published on Mar 2, 2020 4:56 pm IST

మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్ ‘ఉప్పెన’ అనే చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా నుండి ‘నీ కన్ను నీలి సముద్రం… అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదల అయింది. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కి జావేద్ ఆలీ గాత్రం మరింత బలం చేకూర్చింది. అలాగే శ్రీమణి సాహిత్యం కూడా సింపుల్ పదాలతో అర్ధవంతంగా ఉంది. మొత్తానికి సాంగ్ సినిమా పై అంచనాలను పెంచింది.

కాగా ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల కానుంది. వైష్ణ‌వ్‌ తేజ్ తో పాటు నూతన దర్శకుడు బుచ్చిబాబు సానాను దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అయితే విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి ఈ మూవీలో హీరోయిన్ కి తండ్రిగా అలాగే విలన్ పాత్రలో కనిపించనున్నాడట.

‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు. అలాగే ‘రంగస్థలం’ ఫేమ్ రామకృష్ణ మౌనిక ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను చూసుకుంటుండగా… నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

More