ఆ ముగ్గురికి ధన్యవాదాలు – అడవి శేష్

Published on Aug 19, 2019 3:46 pm IST

‘క్షణం’, ‘గూఢచారి’ రీసెంట్ గా ‘ఎవరు’ లాంటి సస్పెన్స్‌ అండ్ థ్రిల్లింగ్‌ సినిమాలతో తనకంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్న యంగ్ హీరో ‘అడివి శేష్‌’. అయితే అడవి శేష్‌ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మొదటి నుంచి సినీ రంగంలో తనను చాలమంది ప్రోత్సహిస్తున్నారని.. వారిలో ముఖ్యంగా అక్కినేని నాగార్జున, అల్లు అర్జున్‌, సమంత అన్ని విధాలుగా తన కెరీర్ కి సపోర్ట్ చేశారని.. ‘ఎవరు’ సక్సెస్ సందర్భంగా ఆ ముగ్గురికి ధన్యవాదాలు అని శేష్‌’ చెప్పుకొచ్చారు.

కాగా వెంక‌ట్ రామ్‌జీ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా రెజీనా కాసాండ్రా హీరోయిన్‌ గా రూపొందిన థ్రిల్ల‌ర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. అడవి శేష్ కెరీర్ లోనే ‘ఎవరు’ మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ప్రస్తుతం శేష్, మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా ఘట్టమనేని మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఏ ప్లస్ ‌ఎస్ సంస్థలు సంయుక్తంగా‌ నిర్మించబోతున్న ‘మేజర్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :