బన్నీ చేసిన పనికి అభిమానులు ఫిదా !

Published on Apr 13, 2019 4:41 pm IST

అభిమానలు అంటే తనకు ఎంత గౌరవమో అల్లు అర్జున్ మరో సారి నిరూపించుకున్నాడు. తమ కోసం ఎక్కడి నుంచో కష్టపడి వచ్చిన అభిమానులను కొందరు హీరోలు చూసి చూడనట్టు చేయి ఊపి వెళ్లిపోతుంటే.. అల్లు అర్జున్ మాత్రం ఏకంగా అభిమానుల దగ్గరకు వెళ్లి మరి వారిని ఆప్యాయంగా పలకరించాడు.

వారితో కలిసి ఫొటోలు కూడా దిగి వారి గురించి అడిగి తెలుసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఈ రోజు అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ సినిమా పూజ కార్యక్రమంతో మొదలైన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రారంభోత్సవ వేడుకను ముగించుకుని వెళ్లిపోతున్నఅల్లు అర్జున్, గేటు దగ్గర తనని చూడటానికి వచ్చిన దివ్యాంగులు ఇద్దరని చూసి కారు ఆపి వారిని ప్రేమగా పలకరించాడు.

అలాగే వాళ్లు ఫోటో దిగాలని కోరిగా వెంటేనే బన్నీ వారితో కలిసి ఫొటో దిగాడు. ఈ సంఘటనతో మొత్తానికి బన్నీ అభిమానుల మనసును దోచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా అవుతొంది.

సంబంధిత సమాచారం :