ర‌ష్మిక మండన్నా ‘పొగ‌రు’ పూర్తయింది !

Published on Sep 10, 2019 8:15 am IST

సెన్సేష‌న‌ల్ బ్యూటీ ర‌ష్మిక మండన్నా హీరోయిన్ గా యాక్ష‌న్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు, కన్న‌డ హీరో ధృవ హీరోగా నంద‌కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పొగ‌రు’. శ్రీ జ‌గ‌ద్గురు మూవీస్ బ్యాన‌ర్‌ పై బి.కె.గంగాధ‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్రెంచ్‌ బాడీ బిల్డ‌ర్ మోర్గాన్ అస్తే, అమెరిక్ ఐ.ఎఫ్‌.బి.బి ప్రొఫెష‌న‌ల్ బాడీ బిల్డ‌ర్ కై గ్రీనే, ఇంట‌ర్నేష‌న‌ల్ అథ్లెట్ ఎవాల్యుయేష‌న్ స్పోర్ట్స్ న్యూటీష‌న్ జాన్ లుకాస్‌, జర్మ‌న్ ఫిట్‌నెస్ సెన్సేష‌న్ జో లిన్‌డ‌ర్ వంటి ఇంట‌ర్నేష‌న‌ల్ బాడీ బిల్డ‌ర్స్ ఈ చిత్రంలో నటిస్తుండటం విశేషం.

కాగా ఈ సినిమా కొన్ని రోజులుగా హైద‌రాబాద్ రామోజీ ఫిలిమ్ సిటీలో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది. తాజాగా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి అయిందని తెలుస్తోంది. హీరో ధృవ స‌ర్జాకు, ఇంట‌ర్నేష‌న‌ల్ బాడీ బిల్డ‌ర్స్‌కు మ‌ధ్య జ‌రిగే క్లైమాక్స్ సినిమాకే హైలైట్‌ గా నిల‌వ‌నుంది. భైర‌వ‌గీత ఫేమ్ ధ‌నుంజ‌య్ ఈ సినిమాలో విల‌న్‌గా న‌టిస్తున్నారు. సంప‌త్ రాజ్‌, ర‌వి శంక‌ర్‌, ప‌విత్రా లోకేష్ త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విజ‌య్ మిల్ట‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్యాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత స‌న్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X