ఏడేళ్ల తర్వాత విడుదలవుతున్న కార్తీ సినిమా..!

Published on Aug 24, 2021 3:02 am IST

కార్తీ హీరోగా నటించిన “మద్రాస్” సినిమా 2014లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అప్పుడే తెలుగులోకి డబ్ కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అది కాస్త వాయిదా పడుతూ వచ్చింది. అయితే దాదాపు ఏడేళ్ల తర్వాత దర్శక నిర్మాతలు ఈ సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు. తాజాగా తెలుగు వెర్షన్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో సినిమా విడుదల కాబోతున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. డ్రీమ్స్ ఫ్యాక్టరీ, స్టూడియో గ్రీన్ మరియు కలసంఘం ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాలో కార్తీ సరసన కేథరిన్ తెరెసా హీరోయిన్‌గా నటిస్తుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మొత్తానికి కార్తీ సినిమా ఏడేళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్ అవుతుండడం విశేషం.

సంబంధిత సమాచారం :