ఆర్ ఎక్స్100 కాంబినేషన్ లో మరో చిత్రం

ఆర్ ఎక్స్100 కాంబినేషన్ లో మరో చిత్రం

Published on Sep 8, 2019 2:00 AM IST

హీరో కార్తికేయ తాజాగా గుణ 369 చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్నారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన గుణ 369 ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇక ఆయన మరో చిత్రానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఆర్ ఎక్స్ 100 ని తెరకెక్కించిన కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఆయన తాజా మూవీకి రంగం సిద్ధమైంది.

శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో అశోక్ రెడ్డి గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈనెల 9వ తారీఖున ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక ప్రకటన పోస్టర్ విడుదల చేయడం జరిగింది. కార్తికేయ రెండవ చిత్రం అయిన ఆర్ ఎక్స్100 ని ఇదే నిర్మాతలు తెరకెక్కించారు. ఆర్ ఎక్స్ 100 మూవీ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ సారి కూడా ఈ కాంబినేషన్ లో మరో సంచలన చిత్రం వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు