హీరో కార్తికేయ చేతుల మీదుగా విడుదలైన ‘మధుర వైన్స్’ ట్రైలర్..!

Published on Feb 4, 2021 10:25 pm IST


సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మధుర వైన్స్ సినిమా ట్రైలర్‌ను నేడు ప్రముఖ హీరో కార్తికేయ విడుదల చేసారు. జయ కిషోర్ బండి దర్శకత్వంలో, ఆర్‌కే సినీ టాకీస్ రాజేష్ కొండెపు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ చూస్తుంటే ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండడంతో పాటు సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలను మరింత పెంచింది.

ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్రైలర్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా ఇంతకంటే ఆహ్లాదకరంగా ఉంటుందని మేకర్స్ ధీమాగా చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మోహన్ చారీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు, సంగీతం కార్తిక్ కుమార్, జై క్రిష్ అందిస్తున్నారు. అయితే త్వరలోనే మధుర వైన్స్‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని, ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేస్తామని దర్శక నిర్మాతలు చెప్పుకొచ్చారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :