హీరో కార్తికేయకు కాబోయే భార్య ఎవరంటే?

Published on Aug 23, 2021 11:42 pm IST

RX 100 ఫేమ్, యంగ్ హీరో కార్తికేయ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. నిన్న హైదరాబాద్‌లో ఆయన నిశ్చితార్ధం జరగ్గా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో కార్తికేయకు కాబోయే భార్య ఎవరన్నది తెలుసుకునేందుకు అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలో కార్తికేయ తనకు కాబోయే భార్య గురుంచి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

ఆమె పేరు లోహిత అని, 2010లో వరంగల్‌ NITలో చదువుతున్నప్పుడు తను పరిచయమయ్యిందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు ఏడడుగుల బంధంగా మారబోతుందని అన్నాడు. నా స్నేహితురాలే భార్య కాబోతుండడం నాకు చాలా సంతోషంగా ఉందని ఉందని, ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉందని కార్తికేయ అన్నాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం కార్తికేయ ‘రాజా విక్రమార్క’ సినిమాలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :