విజయ్ దేవరకొండని ఫాలో అవుతున్న యంగ్ హీరో

Published on Jun 2, 2019 2:23 pm IST

మొదటి మూవీ “ఆర్ ఎక్స్ 100” సూపర్ హిట్ కావడం తో యంగ్ హీరో కార్తికేయ యూత్ లో బాగానే పాపులారిటీ తెచ్చుకున్నాడు. శారీరక సుఖం కోసం ప్రేమికుడి ని వాడుకొని వదిలేసే అమ్మాయి అనే కొత్త కాన్సెప్ట్ తో కొత్త దర్శకుడు అజయ్ భూపతి తీసిన ఈ మూవీ యూత్ ని బాగాకట్టుకుంది. నెగెటివి ఆటిట్యూడ్ తో బోల్డ్ సీన్స్ లో పాయల్ రాజ్ ఫుట్ నటనకు మంచి గుర్తింపే వచ్చింది.

ఐతే హీరో కార్తికేయ విజయ దేవరకొండని ఫాలో అవుతున్నాడా అనిపిస్తుంది. నిన్న జరిగిన తన లేటెస్ట్ మూవీ “హిప్పీ”మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో లో ఓ సాంగ్ లో డాన్స్ చేసిన కార్తికేయ చివర్లో చొక్కా విప్పివేసి తన జిమ్ బాడీని సభాముఖంగాప్రదర్శించాడు. హీరో లు ఏది చేసినా దానికి మొదటి కారణం జనాల్లో పాపులారిటీ కోసమే చేస్తారు. కాకా పొతే ఈ తరం హీరోలు బోల్డ్ మరియు రఫ్ ఆటిట్యూడ్ తో యూత్ కి కనెక్ట్ కావాలని చూస్తున్నారు.

విజయ్ దేవరకొండనే తీసుకుంటే ఆయన సినిమాలే కాదు, బయట ఆటిట్యూడ్ కూడా చాలా కేర్ లెస్ గా ఉంటుంది. సినిమా వేదికలపై మాట్లాడే తీరుకూడా కొంచెం కరుకుగానే ఉంటుంది. తన సినిమాలను విమర్శించే వాళ్ళు సినిమా చూడొద్దని నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. విజయ్ లోని ఈ నేచర్ కే యూత్ కనెక్ట్ అవుతున్నారు. ఈ రౌడీ హీరో రౌడీయిజం తన ఇమేజ్ ని పెంచుకోవడాని భలే ఉపయోగించుకుంటాడు.

కార్తికేయ సినిమాల ఎంపిక విషయంలో కానీ వేదికలపై తన ప్రవర్తనా తీరు చూస్తుంటే విజయ్ దేవరకొండ గుర్తొస్తున్నాడు. “హిప్పీ” మూవీలో కూడా కార్తికేయ హీరోయిన్స్ తో కొంచెం హాట్ రొమాన్స్ చేసినట్టున్నాడు. టీ ఎన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ రంజాన్ కానుకగా ఈ నెల 7న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More