హీరో లక్ష్ “గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు” ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

హీరో లక్ష్ “గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు” ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Published on Aug 24, 2021 4:44 PM IST

వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను, విభిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తున్న‌ క‌థానాయ‌కుడు ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ‌ . వ‌ల‌యం వంటి గ్రిప్పింగ్‌ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌తో అంద‌ర్నీ మెప్పించారు. ఆ వెంట‌నే ఏదో సినిమా చేసేయాల‌ని ఆలోచ‌న‌తో కాకుండా కాస్త గ్యాప్ తీసుకుని త‌న‌దైన పంథాలో గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు అనే డిఫ‌రెంట్ మూవీతో ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

మంగ‌ళ‌వారం గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు ఫ‌స్ట్‌లుక్‌ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేయడం జరిగింది. ఫ‌స్ట్‌లుక్‌ను గ‌మ‌నిస్తే సీరియ‌స్‌గా చూస్తున్న ప‌హిల్వాన్స్‌, వారి మ‌ధ్య‌లో కూల్‌గా స్టైల్‌గా కొబ్బ‌రి బొండం తాగుతూ కూర్చున్న‌ హీరో ల‌క్ష్ క‌నిపిస్తున్నారు. లుక్ చూస్తుంటే ల‌క్ష్ త‌న‌ పాత్ర కోసం ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ బాగానే అయ్యార‌నేది తెలుస్తుంది. అలాగే త‌న లుక్ కూడా డిఫ‌రెంట్‌గా ఉంది. క‌థానాయ‌కుడి పాత్ర స‌రికొత్త డైమ‌న్ష‌న్‌లో ఉంటుంద‌ని లుక్ చూస్తే అర్థ‌మ‌వుతుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కు సంగీతాన్నందించిన యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. తొలి సాంగ్‌ను వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం లో ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ‌, వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌, న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు