‘సరిలేరు నీకెవ్వరూ’ కోసం మహేష్ సరికొత్త బాడీ మేక్ ఓవర్.

Published on Jun 24, 2019 9:13 am IST

ప్రిన్స్ మహేష్ బాబు , రష్మిక మందాన జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న”సరిలేరు నీకెవ్వరూ” మూవీ షెడ్యూలు జులై 4నుండి కాశ్మీర్ లో మొదలుకానుంది. మహేష్ కెరీర్ లో మొదటిసారి ఆర్మీ మేజర్ గా కనిపిస్తుండగా,జులై 5న ఈ షూటింగ్ షెడ్యూల్ లో ఆయన పాల్గొననున్నారు. ఇప్పుడు ఆసక్తికరమైన వార్త ఒకటి మహేష్ మూవీపై ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.అదేంటంటే మహేష్ కొరకు ఇటలీ నుండి స్టంట్స్ నిపుణుల బృదం ఇండియాకి వచ్చారట. వారి పర్యవేక్షణలో స్టంట్స్ కి సంబంధించి ప్రత్యేక శిక్షణలో మహేష్ పాల్గొంటున్నారని సమాచారం. అలాగే మహేష్ ఈ మూవీ కొరకు ప్రత్యేకమైన కసరత్తులు చేయడంతో పాటు డైట్ విషయంలో కూడా గట్టి జాగ్రత్తులు తీసుకుంటున్నారట. దీనితో మహేష్ ని సరికొత్త ఫిజిక్ లో కళ్లుచెదిరే యాక్షన్ సన్నివేశాలలో చూడొచ్చని ఫ్యాన్స్ అప్పుడే సంబరపడిపోతున్నారట.

విజయశాంతి,రమ్యకృష్ణ,జగపతిబాబు వంటి ప్రముఖ నటులు నటిస్తున్న ఈ మూవీని అనిల్ సుంకర,దిల్ రాజు,మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. 2020 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More