లేడీ డైరెక్టర్ తో యంగ్ హీరో కొత్త చిత్రం

Published on Sep 19, 2019 1:30 pm IST

యంగ్ హీరో నాగశౌర్య నేడు ఓ కొత్త మూవీ ప్రకటన చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కనున్న చిత్రంలో ఆయన హీరోగా చేస్తున్నారు. లక్ష్మీ సౌజన్య ఈ చిత్రంతో లేడీ డైరెక్టర్ గా పరిచయం కావడం గమనార్హం. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదలయ్యే అవకాశం కలదు.

ఇక ఇప్పటికే నాగ శౌర్య తన సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో నాగ శౌర్య గాయాలపాలు కావడంతో ఈ మూవీ షూటింగ్ కొంచెం ఆలస్యమైంది. కాగా సమంత ప్రధాన పాత్రలో నాగ శౌర్య నటించిన ఓ బేబీ ఇటీవల విడుదలై సూపర్ హిట్ సాధించింది.

సంబంధిత సమాచారం :

X
More